జమ్మికుంట మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల భారీ దాడులు
మూడు అక్రమ ఇసుక నిల్వలు, రెండు ట్రాక్టర్లు స్వాధీనం.. సుమారు 150 ట్రాక్టర్ లోడ్ల ఇసుక పట్టివేత

జమ్మికుంట, జూన్ 17 (Zindagi9news): కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జమ్మికుంట మండలంలో అక్రమ ఇసుక నిల్వలు, రవాణాపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు అక్రమ ఇసుక డంప్లను గుర్తించి, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 150 ట్రాక్టర్ లోడ్ల మేర అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు పట్టుకున్నారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేయడం, అక్రమంగా తరలించడం చట్టవిరుద్ధమని అధికారులు హెచ్చరించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలు, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పష్టం చేశారు.
ప్రజలు కూడా అక్రమ ఇసుక తవ్వకాలు లేదా రవాణా గురించి సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
