జూన్ 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు

హైదరాబాద్, జూన్ 19(Zindagi9news): ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి నిరసనగా జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పిలుపునిచ్చింది.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆందోళన చేపడుతున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. “విద్య హక్కు – వ్యాపారం కాదు”, “పాఠశాలలను కాపాడుదాం.. విద్యార్థుల భవిష్యత్తును రక్షిద్దాం” అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల విలీనాలు, మూసివేత నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను అరికట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 23న పాఠశాలల బంద్ విజయవంతం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు పిలుపునిచ్చింది.
