
జమ్మికుంట, జూన్ 18 (Zindagi9news) : హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు మంజూరైన ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రాలు) అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. ప్రాజెక్టుల మంజూరుకు తమ కృషే కారణమంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టర్లు, ప్రచార చిత్రాలు విడుదల చేస్తుండటంతో క్రెడిట్ వార్ మళ్లీ తెరపైకి వచ్చింది.
కాంగ్రెస్ హుజురాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్ విడుదల చేసిన పోస్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రూ.45 కోట్ల నిధులతో మూడు ఎస్టీపీలు మంజూరయ్యాయని పేర్కొనగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విడుదల చేసిన పోస్టర్లో స్వచ్ఛ భారత్ మిషన్-2.0 కింద చేపట్టిన ప్రాజెక్టులకు తన కృషి కారణమని ప్రచారం చేశారు.
దీంతో సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తలు పోస్టులను వైరల్ చేస్తూ ఎవరి కృషి వల్ల ఎస్టీపీలు మంజూరయ్యాయనే అంశంపై చర్చకు తెరలేపుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
