మూడు రోజుల పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ సేవలకు విరామం

హైదరాబాద్, జూన్ 18(Zindagi9news):తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ అప్‌గ్రేడేషన్ ద్వారా సేవల భద్రత, పనితీరు మరింత మెరుగుపడనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ), మార్కెట్ విలువ వివరాలు తదితర సేవలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవని వెల్లడించారు.జూన్ 29 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రజలు తమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
