టీజీపీఎస్సీ నుంచి 86 డీఐఈటీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైట్ (DIET) కళాశాలల్లో సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వివరాల ప్రకారం, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డీఐఈటీలలో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, వివిధ సబ్జెక్టుల్లో 63 లెక్చరర్ పోస్టులు కలిపి మొత్తం 86 పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించారు.
అభ్యర్థుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ జూన్ 24, 2026 నుంచి ప్రారంభమై జూలై 29, 2026 వరకు కొనసాగుతుంది.
అర్హతలు, ఎంపిక విధానం, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ www.tgpsc.gov.in ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి (ఇన్చార్జి) ఒక ప్రకటనలో తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
