ఎస్బీఐలో 1,500 పీవో పోస్టులు
జూలై 8 వరకు దరఖాస్తులకు అవకాశం.. ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్ష

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,500 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులను దేశంలోని ఎక్కడైనా నియమించే అవకాశం ఉందని బ్యాంకు పేర్కొంది.
కేటగిరీల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి: ఎస్సీ – 234, ఎస్టీ – 144, ఓబీసీ – 390, ఈడబ్ల్యూఎస్ – 144, అన్రిజర్వ్డ్ (యూఆర్) – 588. అదనంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు.
ముఖ్య తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం : జూన్ 18, 2026
దరఖాస్తుల చివరి తేదీ : జూలై 8, 2026
ప్రిలిమినరీ పరీక్ష : ఆగస్టు 2026
మెయిన్స్ పరీక్ష : సెప్టెంబర్ 2026
సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ : అక్టోబర్ – నవంబర్ 2026
తుది ఫలితాలు : నవంబర్ – డిసెంబర్ 2026
అర్హత కలిగిన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లోని కెరీర్స్ విభాగం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల కోసం వెబ్సైట్:
sbi.bank.in�
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
