
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా గ్రామంలో అవినీతి చర్యలపై మరొకసారి మచ్చెక్కింది. ఫిర్యాదుదారుని నుండి “వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం మరియు ఓపెన్ ప్లాట్‌కు నూతన ఇంటి నంబర్ కేటాయించేందుకు” రూ. 8,000/- లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి పట్టుబడింది.
ఈ ఘటనను అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) సోదాలు నిర్వహించి వెల్లడించారు. అధికారిక విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి లంచం తీసుకుంటూ పట్టుబడడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతానికి ఆమెపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
