
పెబ్బేరు, జూన్ 16 (జిందగి9న్యూస్): భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ విజయవంతంగా 11 సంవత్సరాల పాలనను పూర్తిచేసిన సందర్భంగా, పెబ్బేరు పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో “వికాసిత్ భారత్” కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా ఇంటింటికి, గల్లీగల్లీకి ప్రచారంపై చర్చ జరిగింది. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం, 50 ఏళ్ల ఎమర్జెన్సీపై చర్చతో పాటు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ మెంటపల్లి పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమానికి కావాలి క్రాంతికుమార్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గౌని హేమారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ సూరగౌని రంగస్వామి గౌడ్, జిల్లా విద్యాశాఖ కన్వీనర్ నరసింహనాయుడు, దళిత మోర్చా నాయకులు ఎర్రం రమేష్, కార్యవర్గ సభ్యులు చింతకాయల రమేష్, మాజీ అధ్యక్షుడు కంచ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
అలాగే, పట్టణంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలైన అల్వాల సర్వేశ్వర్ గౌడ్, బలరాం, అరుణ్, రాకేష్ గౌడ్, అరవింద్, కార్తీక్, పవన్, నరహరి, పరశురాం, మోథె రాఘవేంద్ర, సంజీవరెడ్డి, మద్దిలేటి, టి.రాములు, జి.శివ, నాగేష్, ప్రసాద్ బాబు, కుమార్, మేఘనాథ్, నవీన్, శ్రీకాంత్, ప్రదీప్, రాజు, డి.శివ, డి.రాజు, ఏ.శేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
