చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. రూ.లక్ష లంచం పట్టివేత

రంగారెడ్డి, సెప్టెంబర్ 17 (Zindagi9News): చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ తెలిపిన వివరాలు ప్రకారం.. సబ్ ట్రెజరీ ఆఫీసర్ మడిగ లక్ష్మయ్య (AO-1), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కవాలి అనురాధ (AO-2), ప్రైవేట్ వ్యక్తి జంగయ్య (A3) ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఫిర్యాదుదారుడి పెండింగ్‌లో ఉన్న సస్పెన్షన్ కాలం జీతాల బిల్లులు, రిటైర్మెంట్ అనంతర పెన్షన్ సర్దుబాటు బకాయిలను ప్రాసెస్ చేసి పంపించేందుకు అధికారులు రూ.2.50 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా రూ.1 లక్ష చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్లు పేర్కొంది.
ఈ మేరకు AO-1 తన వాటాగా రూ.50 వేలు తీసుకోగా, AO-2 సూచనల మేరకు ప్రైవేట్ వ్యక్తి జంగయ్య ఫిర్యాదుదారుడి నుంచి మరో రూ.50 వేలు స్వీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. దీంతో మొత్తం రూ.1 లక్ష లంచం ఏసీబీ అధికారులకు పట్టుబడింది.
లంచం మొత్తాన్ని AO-1, A3 వద్ద నుంచి వారి సమక్షంలోనే స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.
నిందితులు ముగ్గురినీ హైదరాబాద్ నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట న్యాయ రిమాండ్ కోసం హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదని పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలను కోరింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
