న్యూఢిల్లీ: జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 11న జేఈఈ మెయిన్ 2025 మొదటి సెషన్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు తనిఖీ చేసే విధానం:
✔️ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లింక్ ఓపెన్ చేయండి.
✔️ ‘JEE(Main) 2025 Session-1 Result’ లింక్‌పై క్లిక్ చేయండి.
✔️ మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్ చేయండి.
✔️ స్కోర్‌కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ ద్వారా అర్హత పొందిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం NTA అధికారిక వెబ్సైట్ చూడండి.
