నిజామాబాద్‌లో సర్వీస్ గన్ మిస్‌ఫైర్..రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ మృతి

నిజామాబాద్, సెప్టెంబర్ 18: నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ (RI) హెచ్. సతీష్ సర్వీస్ ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఎన్ఎస్ఓ డ్యూటీ ముగించుకుని హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి వచ్చిన సతీష్.. తన వద్ద ఉన్న సర్వీస్ వెపన్‌ను క్లీన్ చేస్తున్న సమయంలో తుపాకీ మిస్‌ఫైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తుపాకీ ఎలా పేలింది, మిస్‌ఫైర్‌కు దారితీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
