హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో 24 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పటిష్ట తనిఖీలు నిర్వహిస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తరలించే కోళ్ల వాహనాలను నిలిపివేస్తున్నారు. అనుమతులేని వాహనాలను వెంటనే వెనక్కి పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బర్డ్‌ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పౌల్ట్రీ ఉత్పత్తులను శుభ్రంగా వాడాలని అధికారులు సూచించారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన అన్ని నియంత్రణ చర్యలు చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
