అనకాపల్లి: పరవాడలో చీటీ మోసం – కోటి రూపాయలతో పరార్!
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వాడచీపురపల్లి గ్రామంలో భారీ చీటీ మోసం వెలుగుచూసింది. రమణ అనే వ్యక్తి స్థానికులకు చీటీ స్కీమ్ పేరుతో డబ్బులు వసూలు చేసి, సుమారు కోటి రూపాయలతో పరార్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి.
తన పొదుపు డబ్బులను తిరిగి పొందలేకపోయిన బాధితులు, ఈ ఘటనపై పరవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రమణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
గౌరీ శంకర్, విశాఖపట్నం ప్రతినిధి- Zindagi9News
