
ఏన్కూరులో కొత్త ఎస్సై సంధ్యకు శాలువాతో సన్మానం
జిందగీ9న్యూస్ (రిపోర్టర్ రాము), సెప్టెంబర్ 16 : ఏన్కూరులో కొత్తగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సంధ్యను ఎమ్మార్పీఎస్ వైరా ఇన్ఛార్జి జర్రిపోతుల నరేష్ బృందం శాలువాతో సత్కరించింది.
గతంలో బీఎస్పీ పార్టీ వైరా ఇన్ఛార్జి జిల్లా కార్యదర్శిగా, ప్రింట్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన నరేష్ ప్రస్తుతం ఎమ్మార్పీఎస్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న నరేష్ బృందం ఈ సన్మానం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎస్సై సంధ్య మాట్లాడుతూ – “సమాజంలో అవినీతి లేకుండా, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరిగేలా కృషి చేస్తాను. బీద, సామాన్య ప్రజలకు అండగా ఉంటాను” అని తెలిపారు.
