
దేవి శరన్నవరాత్రుల కరపత్రాల ఆవిష్కరణ
వనపర్తి జిల్లా, పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవి శరన్నవరాత్రుల కరపత్రాలను ఆవిష్కరించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ఏడాది శరన్నవరాత్రుల సందర్భంగా 11 రోజుల పాటు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు, అలంకరణలు జరుగనున్నాయని తెలిపారు.
అలాగే ప్రతిరోజూ చండీ హోమం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అల్పాహారం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారి దీక్ష మాలాధారణ చేయదలచిన భక్తులు కమిటీ సభ్యులను సంప్రదించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయానికి తలకంటి సుదర్శన్ రెడ్డి రూ.10,051/- విరాళం అందించారు.
కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి వడ్డే ఈశ్వర్, హనుమంత్ రెడ్డి, శ్రీనివాసులు, శ్రీనివాస్ గౌడ్, మేకల ఎల్లయ్య, బసాల వెంకటేశ్వర్ రెడ్డి, మునీశ్వర్ నాయుడు, TVS బుజ్జి, తలకంటి సుదర్శన్ రెడ్డి, ధరూర్ శ్రీనివాసులు, మధు, ప్రదీప్ గౌడ్, బాలవర్ధన్, చిన్న రాములు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
