
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : మొగుళ్ళపల్లి మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పిడిసిల్ల గ్రామానికి చెందిన మాదం రత్నాకర్ (40) తన బైక్పై 12 సెప్టెంబర్ 2025న కల్లుపల్లె వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో బూజునూరు గ్రామం వద్ద అకస్మాత్తుగా కుక్కలు అడ్డురాగా, అతను సడన్గా బ్రేకులు వేయడంతో బైక్పై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో తొలుత హుజురాబాద్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ, 16 సెప్టెంబర్ తెల్లవారుజామున రత్నాకర్ మృతి చెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లంతకుంట పోలీసులు తెలిపారు.
