ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం

జమ్మికుంట, జూలై 29 (Zindagi9News): హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామానికి చెందిన రైతు అరకాల కుమారస్వామి ట్రాక్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాద ఘటన జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామ సరిహద్దు ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో కుమారస్వామి తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
