తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ (DOST 2026-27) నోటిఫికేషన్ విడుదల: రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST-2026) నోటిఫికేషన్ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) విడుదల చేసింది. రేపటి నుండి (ఏప్రిల్ 15) మొదటి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ముఖ్యమైన కోర్సులు:
B.A, B.Sc, B.Com, B.Com (Voc), B.Com (Hons), BSW, BBA, BBM, BCA వంటి కోర్సులతో పాటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని డి-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన మరియు మహిళా విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో సీట్లను దీని ద్వారా భర్తీ చేస్తారు.
షెడ్యూల్ వివరాలు:
మొదటి విడత (Phase-I):
రిజిస్ట్రేషన్లు: ఏప్రిల్ 15 నుండి మే 07 వరకు. (ఫీజు రూ. 200/-)
వెబ్ ఆప్షన్లు: ఏప్రిల్ 30 నుండి మే 08 వరకు.
సీట్ల కేటాయింపు: మే 14, 2026.
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: మే 15 నుండి మే 23 వరకు.
రెండవ విడత (Phase-II):
రిజిస్ట్రేషన్లు: మే 15 నుండి మే 25 వరకు. (ఫీజు రూ. 400/-)
సీట్ల కేటాయింపు: మే 30, 2026.
మూడవ విడత (Phase-III):
రిజిస్ట్రేషన్లు: మే 31 నుండి జూన్ 15 వరకు. (ఫీజు రూ. 400/-)
సీట్ల కేటాయింపు: జూన్ 20, 2026.
కీలక తేదీలు:
కళాశాలల్లో రిపోర్టింగ్: జూన్ 20 నుండి జూన్ 27 వరకు.
విద్యార్థుల ఓరియంటేషన్: జూన్ 29, 30 తేదీల్లో.
క్లాస్ వర్క్ ప్రారంభం: జూలై 01, 2026 నుండి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.
అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం మరియు రిజిస్ట్రేషన్ కొరకు https://dost.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి సూచించారు.
