తెలంగాణ టెట్ (TG-TET) జూన్-2026 నోటిఫికేషన్ విడుదల: రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG-TET) జూన్-2026 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మరియు టెట్ చైర్మన్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ సోమవారం విడుదల చేశారు. జూన్ 15 నుండి జూన్ 30 మధ్య ఈ పరీక్షలను ఆన్లైన్ (Computer Based Test) పద్ధతిలో నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు ఇవే:
నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 13, 2026
ఆన్లైన్ దరఖాస్తులు & ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు.
హాల్ టికెట్ల డౌన్లోడ్: జూన్ 09, 2026 నుండి.
పరీక్ష తేదీలు: జూన్ 15 నుండి జూన్ 30, 2026 మధ్య.
ఫలితాల వెల్లడి: జూలై 28 నుండి జూలై 31, 2026 మధ్య.
పరీక్ష విధానం – ఫీజు వివరాలు:
టెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1 నుండి 5 తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్-I, 6 నుండి 8 తరగతుల కోసం పేపర్-II రాయాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులు రెండింటినీ ఎంచుకోవచ్చు.
జనరల్ & BC అభ్యర్థులకు: ఒక పేపర్‌కు రూ. 750/-, రెండు పేపర్లకు రూ. 1000/-
SC / ST / PwD అభ్యర్థులకు: ఒక పేపర్‌కు రూ. 700/-, రెండు పేపర్లకు రూ. 950/-
పరీక్ష సమయాలు:
ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి:
ఉదయం సెషన్: 09.00 AM నుండి 11.30 AM వరకు.
మధ్యాహ్నం సెషన్: 02.00 PM నుండి 04.30 PM వరకు.
అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం మరియు ఆన్లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in ను సందర్శించవచ్చు. ఇన్-సర్వీస్ టీచర్లు కూడా నిబంధనల ప్రకారం ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతినిచ్చారు.
