హుజురాబాద్‌లో ఏసీబీ వలలో మున్సిపల్ AE… రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబాటు

హుజురాబాద్, ఏప్రిల్ 15(zindagi9news):
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం మెరుపు దాడి నిర్వహించి, లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ ఇంజనీర్‌ను పట్టుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ నుసుం సుధాకర్ రెడ్డి రూ.50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
ఫిర్యాదుదారునికి సంబంధించిన ఒక పని పూర్తి చేయడానికి సుధాకర్ రెడ్డి రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పథకం ప్రకారం చర్యలు చేపట్టి, లంచం తీసుకుంటున్న సమయంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
సుధాకర్ రెడ్డి వద్ద నుంచి లంచంగా తీసుకున్న నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
