అరెస్ట్ కాదు.. స్వయంగా విచారణకు హాజరైన బండి భగీరథ్
ఇద్దరు న్యాయవాదులతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న భగీరథ్

హైదరాబాద్, మే 16: బండి భగీరథ్ అరెస్ట్ కాలేదని, స్వయంగా పోలీసుల విచారణకు హాజరైనట్లు సమాచారం. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో ఆయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణకు సహకరించారు.
తనపై నమోదైన కేసు నేపథ్యంలో చట్ట ప్రక్రియకు గౌరవం తెలుపుతూ భగీరథ్ స్వచ్ఛందంగా విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు కేసుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి ఇప్పటికే తన కుమారుడిని చట్టంపై గౌరవంతో విచారణకు పంపినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. “చట్టం ముందు అందరూ సమానమే” అని ఆయన పేర్కొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
