
కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేసిన సర్పంచ్
వీణవంక, మే 16 (జిందగీ9న్యూస్): వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గజ్జేల మొగులయ్య జన్మదిన వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు.
అనంతరం పోతిరెడ్డిపల్లి యూత్ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గజ్జేల మొగులయ్య మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ గ్రామ అభివృద్ధికి తన వంతు సేవలు అందించాలని ఆకాంక్షించారు.
గ్రామ అభివృద్ధికి సర్పంచ్ చేస్తున్న కృషి అభినందనీయమని, ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు ఐలవేణి కుమార్, సుమన్, రమేష్, తిప్పని ప్రశాంత్, గజ్జేల శ్రీకాంత్, ప్రకాశ్, సునీల్, రాకేష్, వివేక్, అభిలాష్, నితిన్, అరవింద్, బబ్బులు, శ్రీధర్, శాంతికుమార్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
