తెలంగాణ ఈఏపీసెట్‌లో స్టేట్ ఫస్ట్ సాధించిన విద్యార్థిని రుషిని అభినందించిన గవర్నర్
లోక్ భవన్లో విద్యార్థిని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రశంసించిన గవర్నర్

హైదరాబాద్, మే 18 (జిందగీ9న్యూస్): తెలంగాణ ఈఏపీసెట్-2026 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన విద్యార్థిని మల్లాది రుషిను రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అభినందించారు. సోమవారం లోక్ భవన్లో రుషిని ప్రత్యేకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థిని సాధించిన విజయాన్ని ప్రశంసించిన గవర్నర్, ఆమె కష్టపడి చదివిన తీరు, అంకితభావం, పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే రుషి విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని కూడా ప్రశంసించారు.
కష్టపడి లక్ష్యసాధన కోసం శ్రమిస్తే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు.
