
టేకుమట్ల, మార్చి 11 (zindagi9news): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల సెక్టార్ పరిధిలోని కిష్టయ్యపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న బోయిని ఝాన్సీ అనారోగ్యంతో మార్చి 2న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి చెందిన వెలిశాల సెక్టార్ అంగన్వాడీ సిబ్బంది మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
ఐసిడిఎస్ సూపర్వైజర్ సరోజన ఆధ్వర్యంలో వెలిశాల సెక్టార్‌కు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలిసి మృతురాలి కుమార్తెలకు బుధవారం రూ.20 వేల నగదు అందజేశారు. ఈ సందర్భంగా సరోజన మాట్లాడుతూ మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తామని, ధైర్యంగా ఉండాలని కుమార్తెలకు మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో వెలిశాల సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
