
మహిళా సంఘం రుణం కోసం లంచం… ఏసీబీ వలలో కమ్యూనిటీ ఆర్గనైజర్
హైదరాబాద్: కూకట్పల్లి జోన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో కమ్యూనిటీ ఆర్గనైజర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మూసాపేట్ సర్కిల్-53లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న కె. మురళి, ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ.20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.
రుణ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రతి లక్షకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.18,000 లంచం ఇవ్వాలని మురళి కోరినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి రూ.18 వేల నగదును స్వీకరిస్తుండగా ముందస్తు సమాచారంతో నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
