
ఎడ్ల బండిని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
కరీంనగర్ జిల్లా వల్బాపూర్-జగ్గయ్యపల్లి మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎడ్ల బండిని బైక్ ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న జమ్మికుంటకు చెందిన మైస సురేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మారపల్లి దేవేందర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అభి అనే యువకుడు గాయాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
