
ప్రభుత్వ ఉద్యోగాల్లో వయోపరిమితి 10 ఏళ్లు పెంచాలని వినతి
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో నిరుద్యోగుల వయోపరిమితిని 10 ఏళ్లు పెంచాలని కోరుతూ ఎమ్మెల్సీ కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు వినతిపత్రం అందజేశారు.
ఉద్యోగ నియామకాలలో వయోపరిమితి కారణంగా అనేక మంది నిరుద్యోగులు అవకాశాలు కోల్పోతున్నారని వారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాలు ఆలస్యమైన నేపథ్యంలో అభ్యర్థులకు న్యాయం చేయాలంటే వయోపరిమితిని మరో 10 ఏళ్లు పెంచాలని కోరారు.
ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిరుద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
