
ఆల్కలైన్ వాటర్ పేరుతో మోసం.. అప్రమత్తంగా ఉండాలని FSSAI హెచ్చరిక
దేశవ్యాప్తంగా ఆల్కలైన్ వాటర్ (Alkaline Water) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని Food Safety and Standards Authority of India (FSSAI) హెచ్చరించింది. సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువ కావడంతో చాలామంది ఆరోగ్యానికి మంచిదని భావించి ఆల్కలైన్ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు సాధారణ తాగునీటిలో హానికరమైన రసాయనాలు కలిపి “ఆల్కలైన్ వాటర్” పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇలాంటి నకిలీ ఉత్పత్తులు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగించే అవకాశం ఉందని తెలిపింది.
వినియోగదారులు కొనుగోలు చేసే ముందు బాటిల్‌పై ఉన్న FSSAI లైసెన్స్ నంబర్, తయారీ వివరాలు, pH స్థాయి వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. అనుమానాస్పద ఉత్పత్తులు కనిపిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది.
ఆల్కలైన్ వాటర్‌పై వైద్య నిపుణులు కూడా జాగ్రత్త సూచిస్తున్నారు. సాధారణ ఆరోగ్యవంతులకు ప్రత్యేకంగా ఆల్కలైన్ వాటర్ అవసరం లేదని, శుద్ధి చేసిన సురక్షిత తాగునీరు చాలనేది వారి అభిప్రాయం.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
