
భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..చర్లపల్లి జైలుకు తరలింపు
హైదరాబాద్, మే 17 (Zindagi9News): పొక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌కు మెడ్చల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసు సంబంధిత వివరాలను పరిశీలించిన అనంతరం మెజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు భగీరథ్‌ను సుమారు రెండున్నర గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
కోర్టు విచారణ అనంతరం రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
