EAPCET-2026లో అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయం
32 మంది విద్యార్థులు టాప్ 1000 ర్యాంకులు – కరీంనగర్లో రికార్డు ఫలితాలు

కరీంనగర్, మే 17(Zindagi9News): ఆదివారం రోజున ప్రకటించిన EAPCET-2026 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాయి. కరీంనగర్ చరిత్రలో కనివిని ఎరుగని ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ విద్యార్థులు సత్తా చాటారు.
అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో డి. రిత్విక్ 11వ ర్యాంకు సాధించి అత్యున్నత స్థానంలో నిలవగా, ఇంజనీరింగ్ విభాగంలో పి. చరణ్ 22వ ర్యాంకుతో ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే సి.హెచ్. లక్ష్మీహసిని (74), నిదా (157), పి. అక్షయ (251), ఎల్. అర్యన్రావు (252), మహ్మద్ హూసేన్ (272), వి. రుచిత (293), ఏ. నాగసింధు (330), బి. అభిఘ్న (430), వి. సుహాసిని (439), వి. శ్రేయస్ రెడ్డి (487) తదితరులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
మొత్తంగా 32 మంది విద్యార్థులు టాప్ 1000లో, 57 మంది టాప్ 2000లో, 88 మంది టాప్ 3000లో, 127 మంది టాప్ 4000లో, 169 మంది టాప్ 5000లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ప్రతిష్ఠను మరింత పెంచారని సంస్థ చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు.
ఇటీవల విడుదలైన IIT (Main) ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ విశేష ప్రతిభ కనబరిచిందని, 450 మంది విద్యార్థులు IIT (Advanced)కు అర్హత సాధించడం మరో సంచలనం అని పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళిక, నాణ్యమైన బోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు.
రాబోయే IIT (Advanced), NEET ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులతో ముందంజలో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. EAPCET-2026లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి డా. వి. నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
