తెలంగాణలో జెడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాల ఖరారు – ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలోని స్థానాల ఖరారుపై కీలక ప్రకటన చేసింది. మొత్తం 566 ఎంపీపీలు, (జెడ్పిటిసి)ల స్థానాలను అలాగే 5,773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామపంచాయతీలు, వాటికి సంబంధించిన ఒక లక్ష 12 వేల (1,12,000) వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రక్రియ తర్వాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేపినట్లైంది.
ప్రజాప్రతినిధుల ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల ప్రణాళిక త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఎంపీపీలు, జెడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కోటాల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఈ నిర్ణయం వల్ల పల్లెల అభివృద్ధికి నాయకత్వం అందించే ప్రజాప్రతినిధుల ఎంపికకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గ్రామీణ పాలనలో పారదర్శకతకు దోహదపడేలా ఈ నిర్ణయం ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణకు గౌరవం చేకూరుస్తుంది.
