ఉప ముఖ్యమంత్రిని కలిసిన పెబ్బేరు యువ నేత ఎండీ ఆరీఫ్

హైదరాబాద్, జూలై 15:హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక ఛాంబర్లో పెబ్బేరు మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎండీ ఆరీఫ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వనపర్తి జిల్లా సమస్యలపై చర్చించారు. ప్రత్యేకంగా పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వినతిపత్రం అందజేశారు.
