బీజేపీలో గ్రూపుల ప్రసక్తే లేదు: బండి సంజయ్

హుజూరాబాద్, జూలై 17: బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని, ఒక్క మోదీ గ్రూపే పార్టీకి ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. గురువారం హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ కోసం నిజంగా కష్టపడే వారికి అవకాశాలు, నిధులు లభిస్తాయని పేర్కొన్నారు. గ్రూపుల పేరుతో రాజకీయాలు చేస్తే టిక్కెట్లు వచ్చే అవకాశం లేదని హెచ్చరించారు. “బండి సంజయ్ వర్గం” అంటూ ప్రచారం చేయడం వల్ల పార్టీ టిక్కెట్లు రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
