ప్రజా ప్రభుత్వంలో సంక్షేమానికి అడ్డు లేదని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
భూపాలపల్లి, జూన్ 17 (Zindagi9News):
“సంక్షేమాన్ని వెనకబడనివ్వం.. అభివృద్ధిని ఆపనివ్వం” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర నేతలతో కలిసి మంగళవారం భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చెన్నాపూర్ గ్రామంలో రూ.140 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన తర్వాత, మంజూరునగర్, నవాబుపేట, ధర్మారావుపేట గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపనలు చేశారు.

భట్టి విక్రమార్క సభలో మాట్లాడుతూ:
- ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరు
- మొత్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు
- రాజీవ్ యువ వికాసం ద్వారా 5 లక్షల నిరుద్యోగులకు స్వయం ఉపాధి
- రైతు రుణమాఫీకి రూ.21,500 కోట్లు
- 90 లక్షల కుటుంబాలకు నెలకు 6 కిలోల సన్న బియ్యం
- 57 వేల ఉద్యోగాల భర్తీ పూర్తిచేసి, ఇంకో 30 వేల ఉద్యోగాలు త్వరలో
- మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
- పేద విద్యార్థులకు ‘యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్’
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అధికారులూ, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
