డోన్, నంద్యాల జిల్లా – 28 ఫిబ్రవరి 2025:
డోన్ పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ మంగలి మద్దయ్య (స్వగ్రామం ధర్మవరం) అనారోగ్యంతో గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు, మద్దయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం నేతృత్వంలో డ్రైవర్లు, ఇతర సంఘ నాయకులు మృతుని భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్దయ్య మృతి కుటుంబానికి తీరని లోటని టి.శివరాం అన్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, కిట్టు, రామాంజనేయులు, నాగరాజు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, మహేష్, రమణ, డ్రైవర్ కం ఓనర్లు యర్రగుంట్ల భాస్కర్, బొంతిరాళ్ల మద్దయ్య, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
