జమ్మికుంట, ఫిబ్రవరి 28: వడ్డీ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి ఆర్థిక ఒత్తిడితో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే…మడిపల్లి గ్రామానికి చెందిన సాన శ్రీకాంత్ (36) గత పది సంవత్సరాలుగా గిరి గిరి వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతను పలువురికి రూ. 1 నుంచి 2 లక్షల వరకు అప్పుగా ఇచ్చాడు. అయితే, అప్పు తీసుకున్నవారు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో, గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న అతను ఫ్యాన్‌కు డోర్ కట్టర్ సహాయంతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, మధ్యాహ్నం 3:30 గంటలకు వైద్యులు మృతిచెందినట్లు ధృవీకరించారు.
సమాచారం అందుకున్న జమ్మికుంట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడి భార్య సాన స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
