ఆదర్శ ఉపాధ్యాయుని ఆదర్శ నిర్ణయం
జమ్మికుంట, జూన్ 16 (జిందగి 9 న్యూస్) : భూపాలపల్లి జిల్లాలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు భానోత్ సత్య జ్యోత్ తన కుమారుడు బానోతు సుశాంత్ నాయక్‌ను జమ్మికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురలో 9వ తరగతిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.
ఈరోజు బడి బాట కార్యక్రమంలో భాగంగా ఆయన తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేరుస్తూ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలలపై నాకున్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి నాయకత్వంలో విద్యాభివృద్ధికి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు ఎంతో ఉత్తమంగా ఉన్నాయి. ఇవి మా పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని నమ్మకం,” అని తెలిపారు.
సత్య జ్యోత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ప్రశంసించారు. “ఇది ఇతర తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది,” అని పేర్కొన్నారు.
ఇంతకు ముందు కూడా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇద్దరు కుమారులు ప్రజ్వల్ మరియు ఆదర్శలను ఇదే పాఠశాలలో చేర్పించారు. ఈ తరహా చర్యలు ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.

