
జమ్మికుంట , జూన్ 16 (జిందగి 9 న్యూస్): జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఫార్మసీ గది, ల్యాబ్, మరియు ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
డాక్టర్ చందు చేసిన ముఖ్య సూచనలు ఇలా ఉన్నాయి:
1. NCD క్లినిక్స్ పగడ్బందీగా నిర్వహించాలి. హైపర్టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి.
2. లెప్రసి సర్వేను ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలో కచ్చితంగా నిర్వహించాలి. అవసరమైతే ACF క్యాంపులు ఏర్పాటు చేసి, Sputum సాంపిళ్లు సేకరించి, అవసరమైనవారికి X-rayలు చేయించాలి.
3. ఆరోగ్య మహిళా కార్యక్రమంను మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో తప్పనిసరిగా నిర్వహించాలి. మహిళలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలి.
4. జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుక్రవారం సభలో మహిళలు చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు.
5. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, వాటిని ప్రోత్సహించాలని సూచించారు.
6. వర్షాకాలంలో వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
7. సిబ్బంది సమయపాలన పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే ABHA కార్డులపై శ్రద్ధ చూపించాలని, ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ సదానందం, ఫార్మసిస్ట్ శ్రీధర్, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
