పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు కీలకం: ఎంఈఓ జయరాములు

పెబ్బేరు: పెబ్బేరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన పాఠశాల సముదాయ సమావేశం సందర్భంగా, మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచిన ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ ఎస్. జయరాములు మాట్లాడుతూ – “ప్రతి పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకం. ఆయన చొరవ ఉంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది, విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఏ. విష్ణువర్ధన్ రావు, గుమ్మడం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నరసింహారావుతో పాటు పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠశాలలు విద్యార్థులతో నిండాలంటే ఉపాధ్యాయుల కృషి అవసరమని, అందుకు మంచి నాయకత్వం అందించగలిగే ప్రధానోపాధ్యాయులు ముఖ్యమని అన్నారు.
