తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ ఉత్తర్వుల మేరకు గురువారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, సూపరిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వావిలాల, ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ఏఎన్ఎం లు మరియు ఆశాల ద్వారా వచ్చిన అర్హులైన 25 మంది పురుషులకు కోత,కుట్టులేని (NSV) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ల అనంతరం డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తులకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి వారికి వివరించారు.ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సూపరిండెంట్ సామాజిక ఆరోగ్య కేంద్రం జమ్మికుంట, శ్యాం కుమార్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్,హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సూపర్వైజర్ సదానందం ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
