
విద్యుత్ పనుల దస్తావేజు ప్రాసెసింగ్ కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ సబ్ ఇంజనీరు
సికింద్రాబాద్ పద్మారావు నగర్ సబ్ డివిజన్ పరిధిలోని లాలగూడ సెక్షన్‌కి చెందిన TGSPDCL సబ్ ఇంజనీరు & ఇంచార్జి సహాయక ఇంజనీరు భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడు చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ పనికి సంబంధించి, స్థలంలో సింగిల్ ఫేజ్ మీటర్లను త్రీ ఫేజ్ మీటర్లుగా ఆధునికీకరించేందుకు, అలాగే 63 KVA ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు అంచనా ప్రతిని సిద్ధం చేయడంలో సహకరించేందుకు రూ.15,000/- లంచం కోరిన ఇంజనీరు, డబ్బు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
సుధాకర్ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
