పెబ్బేరు, ఏప్రిల్ 22: విద్యార్థుల శారీరక-మానసిక అభివృద్ధికి తోడ్పడే విధంగా, క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు కెఎల్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ అధ్వర్యంలో వేసవి ఫుట్బాల్ శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ శిక్షణా శిబిరం ఈనెల 24వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానుంది.
తరగతుల సమయం:
ఉదయం: 6:00 నుండి 8:00 గంటల వరకు
సాయంత్రం: 5:00 నుండి 7:00 గంటల వరకు
స్థలం: పిజెపి ఫుట్బాల్ క్రీడా మైదానం, పెబ్బేరు.
ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు అనుభవజ్ఞులైన శిక్షకులు ఫుట్బాల్ నైపుణ్యాలను బోధించనున్నారు. అలాగే, ప్రతిభావంతులైన విద్యార్థులకు క్రీడా సామాగ్రి ఉచితంగా అందజేయనున్నారు.
తల్లిదండ్రులు, గ్రామస్థులూ తమ పిల్లలను ఈ శిక్షణ తరగతులకు పంపి చెడు వ్యసనాల నుండి దూరంగా, ఆరోగ్యంగా, క్రీడా నైపుణ్యాలతో మెరుగు పరచుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ శిక్షణ తరగతుల విజయవంతంగా నిర్వహణకు స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కె. కృష్ణకుమార్ రెడ్డి నాయకత్వం వహించగా, ఎండి. అప్సర్ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
అధిక సమాచారం కోసం సంప్రదించండి:
9441189786, 9948615293, 8374047880
