- ఆర్ఎంపి & పిఎంపి సమస్యలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వినతి పత్రం

భూపాలపల్లి : తెలంగాణ ఆర్ఎంపి & పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ నాయకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణను కలిసి సంఘానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.
సమావేశంలో జిల్లా నాయకులు గ్రామీణ ఆర్.ఎం.పి వైద్యులపై డీఎం & హెచ్ఓ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా జరుపుతున్న దాడులు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులు గ్రామీణ వైద్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని అన్నారు.
ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, సంబంధిత అధికారులతో మాట్లాడి ఇలాంటి దాడులు తక్షణం నిలిపివేయాల్సిందిగా సూచిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని న్యాయసమ్మతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన వైద్యులకు తగిన న్యాయం చేయడం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు.
అలాగే భవిష్యత్లో సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అతి త్వరలో భూమిపూజ చేసి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్ గౌడ్, జనరల్ సెక్రటరీ బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్ల రాజు, జిల్లా చైర్మన్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు కిషన్, రఘు, అశోక్, ఎథిక్స్ కమిటీ చైర్మన్ రమణ, భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు రమేష్, కార్యదర్శి చారి, సీనియర్ వైద్యులు మోహన్ రెడ్డి, రూరల్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, టేకుమట్ల అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి రంజిత్, జిల్లా నాయకులు రవీందర్, రేగొండ అధ్యక్షులు శ్రీధర్, చిట్యాల అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్, రాజు, సీనియర్ నాయకులు నాగేందర్, స్వామి, గోరికొత్తపల్లి అధ్యక్షుడు శ్యామ్, మొగుల్లపల్లి అధ్యక్షుడు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
