
వీణవంక, జూలై 10 (Zindagi9News): వీణవంక మండల కేంద్రానికి చెందిన
కీ.శే. దేవరకొండ ఈశ్వరయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు.
ఈశ్వరయ్య కుటుంబం ప్రస్తుతం ఆర్థికంగా ఎంతో క్షీణించిన స్థితిలో ఉంది. ఆయన భార్య
ఈశ్వరమ్మ, కుమారుడు విజయ్ జీవనోపాధికి కష్టాలు పడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న యుప్ టీవీ & ట్యూరిటో సంస్థల వ్యవస్థాపకులు,
సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి, మానవతా దృక్పథంతో స్పందించారు.
తన అనుచరుల ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబానికి అందజేయించారు.
ఈ సంఘటన స్థానికంగా ప్రశంసలకు పాత్రమైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్,
వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, సమీండ్ల చిట్టి,
తాళ్లపెళ్లి కుమారస్వామి, తొట్ల రాకేష్,
సిరిగిరి రాజశేఖర్, పస్తం కుమార్, ఎండి సలీమ్,
దేవరకొండ ఆదిమూర్తి, రవీందర్, రాంపెల్లి రాములు,
సదానందం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన పాడి ఉదయ్ నందన్ రెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇలాంటి దాతృత్వ చర్యలు మరికొంత మందికి ప్రేరణనిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.
