
స్కూల్ గుర్తింపు కోసం రూ.60 వేల లంచం – అదనపు కలెక్టర్ సహా ముగ్గురు అరెస్ట్
హన్మకొండ జిల్లా డీఈవో కార్యాలయంలో శుక్రవారం లంచం వ్యవహారం కలకలం రేపింది. క్రియేటివ్ మోడల్ స్కూల్ (ప్రాథమిక & ఉన్నత పాఠశాల) గుర్తింపు పునరుద్ధరణ ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి రూ.60,000 లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు ఏసీబీ వలలో చిక్కారు.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) & ఇన్‌ఛార్జి డీఈవో ఎర్రమాడ వెంకట్ రెడ్డి, డీఈవో కార్యాలయం ఉన్నత పాఠశాల విభాగ సీనియర్ అసిస్టెంట్ మొహమ్మద్ గౌసుద్దీన్, ప్రాథమిక పాఠశాల విభాగ జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు సడెన్‌గా దాడి చేసి వారిని పట్టుకున్నారు.
