
మ్యుటేషన్ పత్రాల కోసం రూ.20 వేల లంచం..ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్
నల్లగొండ, డిసెంబర్ 5: చండూరు మండల డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారుని నాన్న (స్వర్గీయుడు)కి చెందిన భూమికి సంబంధించిన గతంలో జారీ చేసిన మ్యుటేషన్ ప్రొసీడింగ్స్ మరియు సంబంధిత పత్రాలను అప్పగించడానికి రూ.20,000/- లంచం డిమాండ్ చేసి, తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి చంద్రశేఖర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
