
కరీంనగర్, అక్టోబర్ 13: కల్వల గ్రామానికి చెందిన సంగి సందీప్ కుమార్తె శ్రద్ధ ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, తలలో ఎముక విరిగినట్లు తేలడంతో వెంటనే ఆపరేషన్ చేశారు. అనంతరం పర్యవేక్షణలో ఆ ఎముక ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడిందని, కృత్రిమ ఎముక (ఆర్టిఫిషియల్ బోన్) అమర్చాల్సి ఉందని వైద్యులు తెలిపారు. దీనికి భారీ ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులకు సూచించారు.
ఈ పరిస్థితిని తెలుసుకున్న గ్రామస్థులు YuppTV & Turito వ్యవస్థాపకుడు, సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి సమాచారం అందించారు. స్పందించిన ఆయన వెంటనే రూ.20,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా శ్రద్ధ తండ్రి సంగి సందీప్ మాట్లాడుతూ –
“పాడి ఉదయ్ నందన్ రెడ్డి మా పరిస్థితిని గమనించి సహాయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా కుటుంబం తరఫున మరియు గ్రామస్థుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసరపు ప్రభాకర్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టి, దాసారపు రాజు, మంతెన శ్రీధర్, తాళ్లపెళ్లి కుమారస్వామి, సిరిగిరి రాజశేఖర్, దాసారపు అశోక్, వంశీకృష్ణ, లోకేష్, పస్తం కుమారస్వామి, నీల ప్రభాకర్, సంగి మహేందర్, గట్టయ్య, చల్లూరి హరీష్, దాసారపు మహేందర్, సమ్మయ్య తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
