మే 1 నుంచి రైల్వే టికెట్ నిబంధనలు కఠినం..
వెయిటింగ్ టికెట్ ప్రయాణికులకు కోచుల్లో ప్రయాణం ఇకనుంచి నిషేధం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 : మే 1వ తేదీ నుంచి భారతీయ రైల్వే టికెట్ నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం, వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించడానికి ఇకపై అనుమతి ఉండదు.
వెయిటింగ్ టికెట్ కలిగిన ప్రయాణికుడు ఆయా కోచ్లలో ఇతరుల సీట్లలో కూర్చొని ప్రయాణిస్తే జరిమానా విధించనున్నారు. కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు మేలు కలిగించే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చామని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణానికి ముందు టికెట్ స్థితిని తప్పనిసరిగా తనిఖీ చేయాలని ప్రయాణికులకు సూచించారు.
