వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలో రూ. 721 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందుల మధ్య అభివృద్ధి:
మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచివేసినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తోందని అన్నారు. మొదటిసారి సీఎం వనపర్తి జిల్లాకు రాబోతుండడంతో, తాను చదివిన పాఠశాల అభివృద్ధితో పాటు 721 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
ప్రధాన అభివృద్ధి పనులు:
🔸వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి – రూ. 1 కోటి
🔸సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం – రూ. 257 కోట్లు
🔸యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల – రూ. 200 కోట్లు
🔸తాను చదివిన జడ్పీ స్కూల్ & జూనియర్ కాలేజీ అభివృద్ధి – రూ. 60 కోట్లు
🔸ఐటీ టవర్ నిర్మాణం – రూ. 22 కోట్లు
🔸కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం – రూ. 81 కోట్లు
🔸రాజనగరం – పెద్దమందడి రహదారి విస్తరణ – రూ. 40 కోట్లు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వనపర్తిలో భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు, నాయకులు సీఎం పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
