
మంత్రి అజారుద్దీన్ దృష్టికి నూర్ భాషా కులస్తుల సమస్యలు
హైదరాబాద్, నవంబర్ 14(zindagi9news) — అఫ్జల్గంజ్లోని సెంట్రల్ లైబ్రరీలో శుక్రవారం నిర్వహించిన లైబ్రరీ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను నూర్ భాషా కులస్తుల ప్రతినిధులు కలుసుకున్నారు.
ఈ సందర్భంగా నూర్ భాషా (A, B, E) గ్రూపుల తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసఫ్ మాట్లాడుతూ— ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనకబాటు ఎదుర్కొంటున్న నూర్ భాషా కులస్తుల సమస్యలను మంత్రికి వివరించామని తెలిపారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు తాను కృషి చేస్తానని మంత్రి అజారుద్దీన్ భరోసా ఇచ్చినట్లు యూసఫ్ తెలిపారు.
మంత్రిని కలుసుకునే అవకాశం కల్పించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, నూర్ భాషా (A, B, E) గ్రూపుల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ అంకూస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
